Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి చేసుకో .. నచ్చకపోతే వదిలేయ్ అని మా అమ్మాయికి చెప్పేశా: దర్శకుడు తేజ

  • నేను పెళ్లి చేయను అని చెప్పాను
  •  శుభలేఖలు పంచడం ఇష్టం వుండదు
  •  మొహమాటానికిపోయి కష్టాలు పడొద్దు   
తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ మాట్లాడుతూ, పెళ్లి విషయంలో తన మనసులోని మాటను బయటపెట్టారు. "మా అమ్మాయికి నేను చాలా కాలం క్రితమే చెప్పేశాను. నేనైతే నీకు పెళ్లి చేయను .. నువ్వే అబ్బాయిని వెతుక్కోవాలి .. పెళ్లి చేసుకోవాలి. నేను శుభలేఖలు సిద్ధం చేయించి .. ఇంటింటికి వెళ్లి మా అమ్మాయి పెళ్లి .. మీరు తప్పకుండా రావాలి అని చెప్పను.

అలా డబ్బులు వేస్ట్ చేయను. నువ్వే పెళ్లి చేసుకో .. ఒక ఏడాది అయిన తరువాత నచ్చకపోతే వదిలేయ్ .. సంతోషంగా వుండు. సమాజం కోసం .. పక్కింటివాళ్ల కోసం .. పెళ్లికి ఇంతమంది వచ్చారుగదా అని నువ్వు కష్టపడి కాపురం చేయకు. నీకు ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు వదిలేసేయ్.. అని చెప్పాను" అంటూ నవ్వేశారు. 
teja

More Telugu News