తనని తాను అర్జునుడిగా అభివర్ణించుకున్న బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవికిషన్!

  • ఆదిత్యనాథ్ కృష్ణుడు
  • గోరఖ్‌పూర్‌ను దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దుతా
  • ఫిలిం సిటీని నిర్మించి యువతకు ఉపాధి కల్పిస్తా
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఎంపీ, భోజ్‌పురి సినీ నటుడు రవికిషన్ తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్నారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికిషన్ మాట్లాడుతూ.. గోరఖ్‌పూర్‌ను దేశంలోనే అత్యున్నత నగరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ కృష్ణుడైతే తాను అర్జునుడినని పేర్కొన్నారు. యోగి నేతృత్వంలో గోరఖ్‌పూర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నగరంలో ఆరు ఫ్లైఓవర్లు నిర్మిస్తానని, అలాగే ఓ ఫిలిం సిటీని అభివృద్ధి చేసే ఆలోచన కూడా ఉందని అన్నారు. తద్వారా యూపీ, బీహార్, జార్ఖండ్ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని రవికిషన్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Actor Ravi kishan
BJP
Uttar Pradesh
Gorakhpur
Adityanath

More Telugu News