కాపురంలో జోక్యం చేసుకుంటోందని అత్తమీద అల్లుడి 'అశ్లీల' ప్రతీకారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాపురంలో జోక్యం చేసుకుంటోందని అత్తమీద అల్లుడి 'అశ్లీల' ప్రతీకారం!

  • భార్యభర్తల మధ్య గొడవలు
  • అల్లుడికి సర్దిచెప్పిన అత్త
  • అత్తమీద కోపంతో ఆమె ఫోన్ నంబర్ అశ్లీల సైట్లో పెట్టిన ప్రబుద్ధుడు
తన కాపురంలో అత్త జోక్యం ఏంటని ఓ యువకుడు ఎంతకు తెగించాడో చూడండి! విశాఖపట్నం ఎన్టీపీసీలో సునీల్ అనే యువకుడు డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. సునీల్ స్వస్థలం వరంగల్ జిల్లా కమలాపూర్. సునీల్ కు హైదరాబాద్ కు చెందిన ఓ యువతితో పెళ్లయింది. మొదట్లో వీరి కాపురం బాగానే సాగినా, ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. దాంతో సునీల్ భార్య తన బాధను తల్లితో మొరపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆమె వచ్చి సునీల్ కు సర్దిచెబుతుండేది.

పిల్లనిచ్చిన అత్త వచ్చి తనకు హితబోధలు చేయడం సునీల్ కు నచ్చేది కాదు. దాంతో ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టాలని భావించి ఆమె ఫోన్ నంబర్ ను ఓ అశ్లీల సైట్లో పెట్టాడు. అమ్మాయిలు కావాలంటే ఈ నంబర్ కు ఫోన్ చేయండి అని అందరికీ కనిపించేలా ఆ నంబర్ ఉంచాడు. ఇక అప్పటి నుంచి ఆమెకు విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చేవి. అన్నీ కూడా అసభ్యకర మాటలు, జుగుప్సాకరమైన వర్ణనలతో కూడిన కాల్స్ కావడంతో ఆమె హడలిపోయింది.

కొన్నాళ్లు గడిచినా పరిస్థితిలో ఏమార్పు రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, దిగ్భ్రాంతికలిగే రీతిలో అసలు విషయం వెల్లడైంది. అల్లుడే తన ఫోన్ నంబర్ ను అశ్లీల సైట్లో పెట్టాడని తెలిసి ఆ అత్తగారికి మతిపోయినంత పనైంది. ఈ పరిణామంతో ఎంతో మనస్తాపం చెందింది. వికృత మనస్తత్వంతో దారుణంగా ప్రవర్తించిన సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కినెట్టారు.
Vizag

More Telugu News