కార్యకర్త పుట్టినరోజును దగ్గరుండి నిర్వహించిన ఢిల్లీ సీఎం.. ఫొటోలు వైరల్
- కార్యకర్తతో దగ్గరుండి కేక్ కట్ చేయించిన కేజ్రీవాల్
- తనకు లభించిన అరుదైన గౌరవం అంటూ ట్వీట్
- పార్టీ కార్యకర్తలే తమకున్న గొప్ప బలమన్న ముఖ్యమంత్రి
‘ఓ సాధారణ కార్యకర్తకు ఓ ముఖ్యమంత్రి నుంచి లభించిన అరుదైన గౌరవం’ అంటూ వివేక్ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్, ఫోటోలు వైరల్ అవడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. దీనిపై స్పందించిన కేజ్రీ, పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసే కార్యకర్తలే తమకున్న గొప్ప బలమని, కార్యకర్తల సాయంతోనే తమ పార్టీ దేశ సేవ చేస్తోందని వ్యాఖ్యానించారు.