దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ఉతికారేస్తున్న ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ఉతికారేస్తున్న ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్

  • వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్
  • ధాటిగా ఆడుతున్న ఆతిథ్య జట్టు
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయి ఆడుతున్నారు. దక్షిణాఫ్రికాతో ఓవల్ వేదికగా జరుగుతున్న పోరులో ఇంగ్లాండ్ 39 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. ఓపెనర్ బెయిర్ స్టో సున్నా పరుగులకే వెనుదిరిగినా, జాసన్ రాయ్ (54), జో రూట్ (51), ఇయాన్ మోర్గాన్ (57), బెన్ స్టోక్స్ (54 బ్యాటింగ్) అర్ధసెంచరీలతో ధాటిగా ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ కు 2 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది.
Cricket

More Telugu News