Andhra Pradesh: తల్లి ఆశీర్వచనం తీసుకుని... భార్యా, బిడ్డలతో సహా భారీ కాన్వాయ్ లో బయలుదేరిన జగన్!

  • మధ్యాహ్నం 12.23కు ప్రమాణం
  • వైఎస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు
  • 25 కార్ల కాన్వాయ్ లో బయలుదేరిన కాబోయే సీఎం
ఈ మధ్యాహ్నం 12.23కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాడేపల్లిలోని తన నివాసం నుంచి 25 కార్లకు పైగా ఉన్న భారీ కాన్వాయ్ లో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంకు బయలుదేరారు. అంతకుముందు ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం తల్లి విజయమ్మ ఆశీర్వచనం తీసుకున్నారు. ఆమెతో పాటు భార్య భారతి, కుమార్తెలు హర్ష, వర్షలు వెంటరాగా, కాన్వాయ్ లో బయలుదేరారు. మార్గమధ్యంలో తాడేపల్లిలో స్థానికులను చూసి, ఆగి వారిని పలకరించారు. జగన్ కాన్వాయ్ స్టేడియంకు చేరుకున్న తరువాత, ఆయన ప్రజలందరికీ అభివాదం చేసి, వేదికపైకి వెళ్లనున్నారు.
Andhra Pradesh
Conyoy
Jagan
YSRCP
CM

More Telugu News