Andhra Pradesh: రాబోయే రోజుల్లో జగన్ యువతకు ఐకాన్ గా నిలుస్తారు!: నటి జయసుధ

  • జగన్ పైన చాలా అనుమానాలు ఉండేవి
  • విల్ పవర్ తో వాళ్లందరి నోళ్లను జగన్ మూయించాడు
  • మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత
రాబోయే రోజుల్లో జగన్ యువతరానికి ఓ ఐకాన్ లా నిలుస్తారని ప్రముఖ నటి, వైసీపీ నేత జయసుధ తెలిపారు. ‘సినిమాల్లో మనం అనేక కథలు చూసుంటాం. స్టాలిన్, భరత్ అనే సినిమాలను కూడా చూశాం. ప్రజామద్దతుతో భారీ విజయాలు సాధించడం సినిమాల్లో కాదు నిజంగా జరుగుతుందని తన గెలుపుతో జగన్ నిరూపించారు.ఆయన హీరోలకే హీరో. నిజమైన హీరో జగన్’ అని వ్యాఖ్యానించారు.

ఏపీలో జగన్ ప్రజారంజక పాలన అందిస్తాడని నమ్ముతున్నట్లు జయసుధ పేర్కొన్నారు. జగన్ తోనే రాజన్న రాజ్యం సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ‘ఎంత రాజకీయ కుటుంబంలో పుట్టినా ఇంతమందికి ఎదురు నిలబడి గెలుస్తాడా? నిలుస్తాడా? అని సహజంగానే సందేహాలు ఉండేవి. అలా అనుకున్నవాళ్లందరి నోళ్లను జగన్‌ తన విల్‌ పవర్‌తో మూయించాడు. ఎంతగా ఇబ్బందులపాలు చేస్తే అంత గట్టిగా తయారయ్యాడు’ అని జయసుధ ప్రశంసించారు.
Andhra Pradesh
Jagan
Chief Minister
jayasudha

More Telugu News