chandrababu: శుభాకాంక్షలు తెలుపుతూ.. జగన్ కు చంద్రబాబు లేఖ

  • జగన్ కు అభినందనలు తెలిపిన చంద్రబాబు
  • రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని సూచన
  • నిర్మాణాత్మకమైన సహకారం అందిస్తామన్న బాబు
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ కాసేపట్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే ముఖ్యమంత్రికి మాజీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలియజేస్తూ లేఖ రాశారు. పేదల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని లేఖలో జగన్ కు సూచించారు. కొత్త ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. టీడీపీ తరపున జగన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
chandrababu
jagan
letter

More Telugu News