రేపు జగన్ ఇంటికి వెళ్లనున్న పయ్యావుల, గంటా, అచ్చెన్నాయుడు!
- జగన్ కు శుభాకాంక్షలు తెలపనున్న టీడీపీ బృందం
- సభావేదిక వద్దకు వెళ్లరాదని నిర్ణయం
- ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్ ప్రమాణస్వీకారం
రేపు ఉదయాన్నే ఈ బృందం తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు చెబుతుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రమాణస్వీకార వేదిక వద్దకు టీడీపీ బృందం వెళ్లరాదని పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.