Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు నిలిచిన కరెంట్... ఆగిన సేవలు!

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెక్యూరిటీ చెక్ పాయింట్స్, ఎస్కులేటర్స్, ఎయిర్ పోర్టులోని దుకాణాలు, బోర్డింగ్ పాయింట్ గేట్స్, లిఫ్ట్ లకు కరెంట్ సరఫరా నిలిచింది. దీంతో బ్యాగేజ్ చెకింగ్స్, బోర్డింగ్ పాస్ ల జారీ ఆగిపోయింది. భద్రతా సిబ్బంది ఎమర్జెన్సీ గేట్లకు తాళాలు వేశారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయం అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కరెంట్ నిలిచిపోవడంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. టెక్నికల్ సమస్య కారణంగానే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, సాధ్యమైనంత త్వరలో కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Shamshabad
Airport
Power Cut

More Telugu News