బీజేపీలో దూకేందుకు సిద్ధమైన ముగ్గురు తృణమూల్ ఎమ్మెల్యేలు

  • ఢిల్లీ వెళ్లిన ముగ్గురు తృణమూల్ శాసనసభ్యులు
  • మోదీ, షాల సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం
  • తనతో 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఇటీవలే చెప్పిన మోదీ
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ తనతో 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా మండిపడ్డారు. అయితే, ఆ రోజు మోదీ ఊరికే ఆ మాటలు చెప్పలేదని ఇప్పుడు అర్థమవుతోంది. తాజాగా, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నపళాన ఢిల్లీ వెళ్లడం సీఎం మమతను కలవరపాటుకు గురిచేస్తోంది.

ఆ ముగ్గురిలో ఒకరైన సుభాన్షు రాయ్ పై పార్టీ వ్యతిరేక వైఖరి కారణంగా అధినాయకత్వం ఆరేళ్ల నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో సుభాన్షు రాయ్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. అక్కడ మోదీ, అమిత్ షాల సమక్షంలో వీరు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు.
Go Back to Shorts
Narendra Modi
BJP
West Bengal
TMC

More Telugu News