గుంటూరు, శ్రీకాకుళం లోక్సభ స్థానాలపై హైకోర్టును ఆశ్రయించనున్న వైసీపీ
- అధికారుల కారణంగా టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి
- జగన్ వద్ద మొర పెట్టుకున్న నేతలు
- రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని ఆరోపణ
గుంటూరు పోస్టల్ బ్యాలెట్ల అంశంపై అక్కడి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మోదుగుల ఆరోపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్ల సంఖ్య దాదాపు 9 వేలకు పైనే ఉందని, వాటిని లెక్కించలేదని, వాటిని లెక్కిస్తే తన విజయం ఖాయమై ఉండేదని మోదుగుల జగన్ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని వైసీపీ నిర్ణయించింది.