పోలవరం ప్రాజెక్టుకు డాక్టర్‌ వైఎస్సార్‌ పేరు పెట్టాలి: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

  • ప్రాజెక్టుకు భూమిపూజ చేసింది రాజశేఖర్‌రెడ్డే
  • ఆయన హయాంలోనే కాలువల నిర్మాణం పూర్తయింది
  • ఆయన పేరు పెడితేనే న్యాయంగా ఉంటుంది
రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక భారీ ప్రాజెక్టు పోలవరానికి దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు భూమిపూజ జరిగిందని, కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చింది ఆయనేనని గుర్తుచేశారు. వైఎస్సార్‌ అధికారంలో ఉన్నప్పుడే పోలవరం కాలువ నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఏ విధంగా చూసినా ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్సార్‌ భాగస్వామ్యం అధికం కావున 'డాక్టర్‌ వైఎస్సార్‌ పోలవరం ప్రాజెక్టు' అని నామకరణం చేయడం బాగుంటుందని విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
polavaram
machilipatnam MP
balasouri
YSR name demond

More Telugu News