మోదీకి శుభాకాంక్షలు చెప్పిన నటి షబానా ఆజ్మీ.. ఆటాడుకుంటున్న నెటిజన్లు!
- మోదీ గెలిచి పీఎం అయితే దేశం విడిచి పాక్ వెళ్లిపోతానన్న నటి
- ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
- ఎప్పుడు వెళ్లిపోతున్నారో చెప్పాలంటూ ప్రశ్నలు
షబానా ట్వీట్‌ను చూసిన నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆమె చేసిన ‘పాకిస్థాన్’ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తమరు ఎప్పుడు దయచేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మరో ఐదేళ్ల వరకు మోదీయే ప్రధాని అని, ఈ విషయాన్ని మీ భర్త, కుమారుడితో చెప్పాలని సూచిస్తున్నారు. ఈ రాత్రికి కూడా పాకిస్థాన్ వెళ్లేందుకు రైలు ఉందంటూ కొందరు ట్వీట్ చేశారు. శుభాకాంక్షలు చెప్పడం వరకు బాగానే ఉందని కానీ, మీరు పాకిస్థాన్ వెళ్లేది ఎప్పుడో చెప్పలేదంటూ మరో యూజర్ వేళాకోళం చేశాడు.