మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ అసెంబ్లీకి...సంచలన విజయం సాధించిన అంబటి
- 1989లో తొలిసారి గెలుపు
- గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యేగా ప్రస్థానం
- ఆ తర్వాత మళ్లీ రాని అవకాశం
పార్టీ అధికార ప్రతినిధిగా, మంచి వాగ్ధాటి ఉన్న వ్యక్తిగా రాంబాబుకు పేరుంది. 1989లో రేపల్లె నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1994, 1999లో రేపల్లె నుంచే మళ్లీ పోటీ చేసిన ఆయన విజయం సాధించలేకపోయారు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీచేసి కోడెల చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో మళ్లీ ఆయనపైనే పోటీ చేసి విజయం సాధించడం ద్వారా సత్తా చాటారు.