చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనన్న వర్మ!

  • ట్విట్టర్ లో ఫొటో పోస్టు చేసిన వర్మ
  • మాటల్లేకుండా ఫొటోతో విషయం చెప్పిన దర్శకుడు
  • రిటర్న్ గిఫ్ట్ కు తనదైన భాష్యం
తెలంగాణ ఎన్నికల్లో కూటమితో కలిసిన చంద్రబాబుకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని సీఎం కేసీఆర్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో టీడీపీ ఘోరపరాభవం దిశగా సాగుతున్న నేపథ్యంలో, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.

అయితే, వర్మ తన ట్వీట్ లో క్యాప్షన్ పెట్టకపోయినా, అర్థవంతమైన చిత్రం ద్వారా తన భావాన్ని వెల్లడి చేశారు. వర్మ ట్వీట్ చేసిన ఫొటోలో జగన్ చిత్రపటాన్ని కేసీఆర్ తన స్వహస్తాలతో చంద్రబాబుకు అందిస్తున్నట్టుగా ఉంది. ఆ ఫొటోపై రిటర్న్ గిఫ్ట్ అని రాసి ఉండడంతో వర్మ ఉద్దేశం ఏంటో, ఎవర్ని విమర్శించడానికి ఈ ట్వీట్ చేశాడో సులభంగా అర్థమవుతోంది.
Go Back to Shorts
RGV
Chandrababu
KCR

More Telugu News