చరిత్రను తిరగ రాస్తున్న బీజేపీ యువ అభ్యర్థి తేజస్వి సూర్య

  • లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో సూర్య
  • బెంగళూరు సౌత్ నుంచి బరిలోకి
  • కర్ణాటకలో క్లీన్ స్వీప్ దిశగా బీజేపీ
కర్ణాటకకు చెందిన 28 ఏళ్ల బీజేపీ యువనేత తేజస్వి సూర్య రికార్డులు తిరగరాస్తున్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌పై ఏకంగా లక్ష ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బెంగళూరు సౌత్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన తేజస్వీ సూర్య కర్ణాటక బీజేపీ యూత్‌వింగ్‌కి ప్రధాన కార్యదర్శి కూడా. అలాగే, ఈ ఎన్నికల్లో బీజేపీ జాతీయ సోషల్ మీడియా ప్రచార బృందంలో సభ్యుడు కూడా.  

తాజా ట్రెండ్స్ ప్రకారం కర్ణాటకలో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
Go Back to Shorts
BJP
Karnataka
Tejasvi Surya

More Telugu News