మా నాన్న మాట కాదని 'సీత' సినిమా చేశాను: బెల్లంకొండ శ్రీనివాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా నాన్న మాట కాదని 'సీత' సినిమా చేశాను: బెల్లంకొండ శ్రీనివాస్

  • రేపే థియేటర్లకు 'సీత' సినిమా
  •  పాత్ర పరంగా నాకు సంతృప్తినిచ్చింది 
  • సక్సెస్ ఇస్తుందనే నమ్మకం వుంది   
తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత' సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఆమె జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. రేపు ఈ సినిమా థియేటర్లకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "తేజ రెండు కథలతో మమ్మల్ని కలిశారు. మా నాన్నకి నాకు కలిపి రెండు కథలను వినిపించారు.

నాకు 'సీత' కథ నచ్చింది ..  మా నాన్నకు మాత్రం మరో కథ నచ్చింది .. అది యాక్షన్ ఎంటర్టైనర్. ఆ సినిమానే చేయమని నాన్న అన్నాడు. నేను ఎప్పుడూ మా నాన్న ఓకే చెప్పిన సినిమానే చేస్తాను. ఈ సారి మాత్రం నాకు 'సీత' కథ నచ్చిందని చెప్పి, ఆయన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ సినిమా చేశాను. అందుకే ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. పాత్ర పరంగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన ఈ సినిమా, సక్సెస్ కూడా ఇస్తుందనే నమ్మకంతో వున్నాను" అని చెప్పుకొచ్చాడు. 
bellamkonda srinivas
Kajal Agarwal

More Telugu News