సీఈసీ నిర్ణయంపై లోకేశ్ అసంతృప్తి!

  • నిజమైన, న్యాయమైన డిమాండ్ ను పక్కనపెట్టింది
  • సీఈసీ ఎవరి పక్షాన నిలబడిందో మరోసారి స్పష్టమైంది
  • భారత ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు
ఓట్ల లెక్కింపులో భాగంగా ఈవీఎంల కంటే ముందు వీవీ ప్యాట్లను లెక్కించాలన్న విపక్షాల డిమాండ్ ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తిరస్కరించింది. సీఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మెజార్టీ పార్టీల డిమాండ్ ను విస్మరించిన ఈసీ, ఎవరి పక్షాన నిలబడిందో ఈ నిర్ణయం ద్వారా మరోసారి స్పష్టమైందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం నిజమైన, న్యాయమైన డిమాండ్ ను ఎటువంటి కారణం లేకుండా పక్కనపెట్టిందని, భారత ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని లోకేశ్ విమర్శించారు.
Go Back to Shorts
CEC
Telugudesam
Nara Lokesh
EVM`s
VV pat`s

More Telugu News