సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ప్రభాస్ కి కంగ్రాట్స్ చెప్పిన అనుష్క
- విజయ్ దేవరకొండ 'బ్రేక్ అప్'
- మహేశ్ 'మహర్షి' మరో రికార్డు
* విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'బ్రేక్ అప్' అనే టైటిల్ని నిర్ణయించనున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
* మహేశ్ బాబు హీరోగా ఇటీవల వచ్చిన 'మహర్షి' చిత్రం మంచి ప్రేక్షకాదరణతో కలెక్షన్లలో దూసుకుపోతోంది. విశేషం ఏమిటంటే, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలోని 21 ప్రధాన సెంటర్లలో ఈ చిత్రం కోటి రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.