Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూట్యూబ్‌లో ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారం.. గూగూల్‌తో డీడీన్యూస్ ఒప్పందం

  • మరో 24 గంటల్లో ఎన్నికల లెక్కింపు ప్రారంభం
  • యూట్యూబ్ ద్వారా ఫలితాలను అందించనున్న డీడీన్యూస్
  • గూగుల్‌తో ఒప్పందం
మరో 24 గంటలే. దేశం మొత్తం ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడానికి ఉన్న సమయం. జాతీయ, స్థానిక చానళ్లన్నీ ఇప్పటికే ఫలితాలను లైవ్‌లో అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకోగా, ఇప్పుడు ప్రసారభారతి కూడా ముందుకొచ్చింది. సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌తో కలిసి ఓట్ల లెక్కింపును యూట్యూబ్ ద్వారా లైవ్‌లో అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలకు సంబంధించిన సమాచారాన్ని యూట్యూబ్ ద్వారా డీడీ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుందని ప్రసార భారతి సీఈవో శశిశేఖర్‌ వెంపటి తెలిపారు. గురువారం యూట్యూబ్‌ను ఓపెన్ చేసే వారికి అన్నింటికంటే పైన ఎన్నికల ప్రత్యక్ష ప్రసారం కనిపిస్తుందని శశిశేఖర్ పేర్కొన్నారు. మొత్తం 14 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు.
DD News
Google
Election results
Live update

More Telugu News