ఇస్రో మరో విజయం.. పీఎస్ఎల్వీ సి-46 ప్రయోగం సక్సెస్
- ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు ప్రయోగం
- పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 48వది
- రిశాట్-2బీఆర్1ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు
రీశాట్-2బీఆర్1 ఉపగ్రహం కాలపరిమితి రెండేళ్లు. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను, ఉగ్రశిబిరాలను ఇది సులభంగా గుర్తిస్తుంది. కాబట్టి రక్షణ శాఖకు ఇది ఎంతో కీలకం కానుంది. అలాగే, వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 48వది.