ఏపీఎస్సార్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు విఫలం.. మోగనున్న సమ్మె గంట!
- కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించలేం
- నిధులు రాగానే వేతన సవరణ బకాయిలు చెల్లిస్తాం
- అప్పటి వరకు సమ్మె యోచన విరమించుకోవాలి: ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు
ఈ విజ్ఞప్తిపై ఐకాస నేతలు స్పందిస్తూ, తమ డిమాండ్ల సాధనకు ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగినందున ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. వేతన సవరణ బకాయిలు సహా 27 డిమాండ్లపై స్పష్టమైన హామీ రాలేదని అన్నారు. సత్వరం తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు దిగుతామని, రేపు ఉదయం పదకొండు గంటలకు సమావేశమై సమ్మె తేదీ ప్రకటిస్తామని ఐకాస నేత దామోదర్ పేర్కొన్నారు.