నాకెందుకో అనిల్ రావిపూడి హీరో అవుతాడనిపిస్తోంది: పరుచూరి గోపాలకృష్ణ
- దర్శకుల సంఘం ఫంక్షన్ కి వెళ్లాను
- స్టేజ్ పై అనిల్ రావిపూడి యాక్టింగ్ చూశాను
- ఆయనలో మంచి నటుడు వున్నాడు
సిద్ధార్థ్ దర్శక శాఖ నుంచే హీరో అయ్యాడు. అలాగే రవితేజ .. నాని కూడా దర్శక శాఖలో పనిచేసి ఆ తరువాత హీరోలయ్యారు. ఆ లైన్లో ఇప్పుడు అనిల్ రావిపూడి వున్నట్టుగా నాకు అనిపిస్తోంది. మొన్న వేదికపై అనిల్ రావిపూడి డైలాగ్ డెలివరీ .. ఎక్స్ ప్రెషన్ చూసినప్పుడు ఆయన త్వరలో హీరో అవుతాడనిపించింది. సాధారణంగా నటించేటప్పుడు చేతులను కిందికి వదిలేయకుండా ఏం చేయాలో తెలిసినవాళ్లు మంచి నటులవుతారని అంటారు. అలాంటి ఇబ్బందేమీ లేకుండా అనిల్ రావిపూడి చాలా చక్కగా చేశాడు" అని చెప్పుకొచ్చారు.