ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ.. డీజీపీకి శాప్ మాజీ చైర్మన్ ఫిర్యాదు !
- 2015లో శాప్ చైర్మన్ గా పీఆర్ మోహన్ నియామకం
- అప్పుడు క్రీడా శాఖా ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎల్వీ
- ప్రభుత్వ ఉత్తర్వుల అమలులో ఎల్వీ జాప్యం చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు
ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ ఠాకూర్ కు మోహన్ ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీని ఈరోజు కలిశారు. నాడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారని, ఓ ఉన్నతాధికారి ఉదాసీన వైఖరితో తాను మనో వేదనకు గురయ్యానని తన ఫిర్యాదులో మోహన్ ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.
ఈ విషయమై శ్రీకాళహస్తిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 8న ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని తిరుపతి అర్బన్ ఎస్పీని ఠాకూర్ ఆదేశించినట్టు సమాచారం.