శ్రీశైల క్షేత్రంలో భారీ వర్షం... నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు!
- ఘాట్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం
- కొబ్బరిచెట్టుపై పడిన పిడుగు
- భక్తులకు తీవ్ర ఇబ్బందులు
పలు దుకాణాల రేకులతో పాటు, దుకాణాల ముందు ఏర్పాటు చేసిన టెంట్లు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సున్నిపెంట సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం పక్కన ఉన్న ఓ కొబ్బరిచెట్టుపై పిడుగుపడి మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. భారీ వర్షంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.