ఒక్క రూపాయికే అంత్యక్రియలు..కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రకటన!
- శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత మున్సిపాల్టీలదే
- ఇందులో భాగంగానే ‘రూపాయికే అంత్యక్రియలు’
- నగరపాలక సంస్థలో ఓ ప్రత్యేక విభాగం ఏర్పాటు
ఈ కార్యక్రమం కోసం నగరపాలక సంస్థలో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, రూ.1.50 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. రెండు ప్రత్యేక వాహనాలు , ఒక ఫ్రీజర్, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తున్నామని, జూన్ 15 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. మృతదేహాన్ని ఇంటి వద్ద నుంచి శ్మశాన వాటికకు తరలించే వాహనం, దహన సంస్కారాలు, ఇతర ఏర్పాట్లన్నింటినీ నగరపాలక సంస్థే చేస్తుందని అన్నారు.