బెంగాల్ లో బాగా వస్తాయి.. ఏపీలో మాత్రం కష్టం!: విష్ణుకుమార్ రాజు

  • దేశ వ్యాప్తంగా బీజేపీకి ఎంపీ సీట్లు ఎక్కువే వస్తాయి
  • ప.బె.లో బీజేపీకి వచ్చే స్థానాలపై పక్కా సమాచారం
  • బీజేపీ వ్యతిరేక కూటమి కలగానే మిగులుతుంది
పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి 30 ఎంపీ స్థానాలు వస్తాయని ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీకి ఇన్ని స్థానాలు వస్తాయన్న పక్కా సమాచారం ఉందని వ్యాఖ్యానించిన విష్ణుకుమార్ రాజు, ఏపీలో మాత్రం బీజేపీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదని చెప్పడం గమనార్హం. బీజేపీకి దేశ వ్యాప్తంగా ఎంపీ సీట్లు అధిక సంఖ్యలో వస్తాయని తేలడంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువైందని సెటైర్ వేశారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలన్న వారి కలలు కల్లలేనని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Andhra Pradesh
bjp
vishnu kumar raju
West Bengal

More Telugu News