తిరుమలలో మీడియాతో మాట్లాడిన లగడపాటి రాజగోపాల్!
- అలిపిరి నుంచి కాలినడకన చేరుకున్న నేత
- స్వామివారికి ప్రత్యేక పూజలు
- నిన్న సర్వే విడుదల చేసిన లగడపాటి
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 100 (అటూ ఇటూగా 10 స్థానాలు) రావొచ్చని లగడపాటి రాజగోపాల్ చెప్పిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి రాకపోయినా గట్టి పోటీ ఇచ్చిందనీ, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 72 (అటూ ఇటూగా 7 స్థానాలు), ఇతరులు 3 (అటూ ఇటూగా 2 స్థానాలు) వస్తాయని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీదే పై చేయిగా ఉంటుందని అన్నారు. టీడీపీకి 15 (అటూ ఇటూగా 2 స్థానాలు) వైసీపీకి 10 (అటూ ఇటూగా 2 స్థానాలు) ఇతరులు ఓ స్థానం సాధించే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు.