బ్రెజిల్ బార్ లో కాల్పుల మోత.. 11 మందిని కాల్చిచంపిన దుండగులు!

  • పారా రాష్ట్రంలోని బెలెమ్ నగరంలో ఘటన
  • కార్లు, బైక్ లపై బార్ వద్దకు వచ్చిన ముఠా
  • ఓ నిందితుడిని సజీవంగా పట్టుకున్న పోలీసులు
బ్రెజిల్ లోని పారా రాష్ట్రంలో ఉన్మాదులు రెచ్చిపోయారు. బెలెమ్ నగరంలోని ఓ బార్ లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మహిళలు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ అల్లరిమూక బైక్ లు, కార్లపై బార్ వద్దకు చేరుకుందని తెలిపారు.

కాల్పుల అనంతరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా, వీరంతా పారిపోయేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ సందర్భంగా వీరిని వెంటాడిన పోలీసులు ఓ నిందితుడిని పట్టుకున్నారనీ, మిగతావారు తప్పించుకున్నారని పేర్కొన్నారు. గ్యాంగ్ వార్ కారణంగా ఈ అఘాయిత్యానికి తెగబడ్డారా? లేక మరేదయినా కారణం ఉందా? అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
brazil
shootout
11 dead
Police

More Telugu News