భార్యపై కోపాన్ని రైలుపై చూపించిన యువకుడు!
- తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఘటన
- రైల్వే ట్రాక్‌పై బైక్ నిలిపి కూర్చున్న నిందితుడు
- లోకో పైలట్ గుర్తించడంతో తప్పిన ప్రమాదం
అదే సమయంలో మధురై నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలు లోకోపైలట్ పట్టాలపై బైక్ ఉన్న విషయాన్ని దూరం నుంచే గుర్తించి రైలును నిలిపివేశాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కిందికి దిగిన ప్రయాణికులు పట్టాలపై బైక్‌పై కూర్చున్న వ్యక్తిని చూసి నివ్వెరపోయారు. బైక్ తీయమని ఎంతగా మొత్తుకున్నా షణ్ముగవేల్ వినిపించుకోలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, వారు వచ్చేసరికే అతడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు షణ్ముగవేల్ కోసం గాలిస్తున్నారు.