ఎన్డీయేలో జోష్ పెంచిన ఎగ్జిట్ పోల్స్.. రేపు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ!

  • బీజేపీకే పట్టం కట్టిన సర్వేలు
  • 21న సమావేశం కానున్న ఎన్డీయే నేతలు
  • 22న యూపీయే నేతలతో సోనియా భేటీ
బీజేపీ మరోమారు అధికారంలోకి రాబోతోందంటూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో చెప్పడంతో ఎన్డీయేలో జోష్ పెరిగింది. బీజేపీ, దాని మిత్ర పక్షాలన్నీ ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ పూర్తి అనుకూలంగా ఉండడంతో ఫలితాల వెల్లడికి ముందే సమావేశం కావాలని ఎన్డీయే పక్షాలు సమావేశం కావాలని నిర్ణయించాయి. ఈ నెల 21న నిర్వహించనున్న ఈ భేటీకి బీజేపీ, దాని మిత్ర పక్షాలు హాజరై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నాయి.

మరోవైపు, ఈ నెల 22న యూపీఏ నేతలు కూడా సమావేశం కానున్నారు. యూపీఏతో కలిసి వచ్చే పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సోనియా గాంధీ సారథ్యంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశం ఏర్పాటు వెనక ఏపీ సీఎం చంద్రబాబు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
BJP
NDA
UPA
Sonia Gandhi
Chandrababu

More Telugu News