హాజీపూర్ ఘటనపై తొలిసారి స్పందించిన కేటీఆర్!
- మల్యాల సర్పంచ్‌కు ఫోన్ చేసిన కేటీఆర్
- ఫలితాల తర్వాత గ్రామాన్ని సందర్శిస్తానని హామీ
- కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు
స్పందించిన కేటీఆర్ మల్యాల సర్పంచ్ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. హాజీపూర్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారని, మరోసారి ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక హాజీపూర్‌ను సందర్శిస్తానని కేటీఆర్ తెలిపారు.