Chandrababu: ఇదేనా గుజరాత్ మోడల్ అంటే?: సాధ్వీ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన

బీజేపీ నేత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. గాంధీని పొట్టనబెట్టుకున్న గాడ్సేను గొప్ప దేశభక్తుడు అంటూ సాధ్వీ ప్రజ్ఞా ఆకాశానికెత్తడంపై ఆయన ట్వీట్ చేశారు. "మొదట మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కరేను దూషించారు. ఆయన ఇప్పుడు లేరు కూడా. ఇప్పుడు జాతిపిత మహాత్ముడిపై పడ్డారు. అహింసాదూత, ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అయిన మహాత్మా గాంధీపైనే విమర్శలు చేస్తున్నారు. ఇదేనా మీరు చెబుతున్న గుజరాత్ మోడల్? ఈ సందేశాన్నే భారతదేశమంతా వ్యాప్తి చేయాలనుకుంటున్నారా?" అంటూ ప్రశ్నించారు.

జాతిపితను చంపినవారిని గొప్ప దేశభక్తులుగా బీజేపీ నాయకులు కీర్తించడం చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోందని పేర్కొన్నారు. బీజేపీకి చెందిన నేతలే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇలాంటి వారికి మద్దతుగా నిలవడం చూస్తుంటే వారి దేశభక్తి ఏంటో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
Chandrababu
Narendra Modi
BJP

More Telugu News