ప్రస్తుతం తెలంగాణను చినజీయర్ స్వామి పరిపాలిస్తున్నారు!: ప్రొ.కంచ ఐలయ్య ఆరోపణ
- కేసీఆర్ దళిత, బీసీ పక్షపాతినని అంటారు
- కానీ ఒక్క అంబేద్కర్ విగ్రహానికీ నివాళులు అర్పించలేదు
- హైదరాబాద్ లో జరిగిన సదస్సులో వ్యాఖ్య
హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం కూల్చిన చోటే కొత్త విగ్రహం పెట్టాలని ఐలయ్య డిమాండ్ చేశారు. మరోవైపు అన్నిరకాల వేధింపులతో పాటు ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడే కులవివక్ష అంతం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే దళితులు, కమ్యూనిస్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.