Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాజమౌళి సినిమాలో అనుష్క లేదట 
  • బడ్జెట్ తగ్గించిన బోయపాటి 
  • మహేశ్ కొత్త సినిమా అప్ డేట్ 
*  ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో ప్రముఖ నటి అనుష్క ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే, ఇది నిజం కాదని, ఈ చిత్రంలో ఆమె నటించడం లేదని చిత్రం యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
*  బాలకృష్ణ, బోయపాటి కలయికలో మరో భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదట్లో ఈ చిత్రానికి దర్శకుడు 60 కోట్ల బడ్జెట్ ఇచ్చాడని, అయితే బాలయ్య మాత్రం 40 కోట్ల బడ్జెట్ లోనే సినిమా చేయాలని సూచించడంతో ఆ కథను పక్కన పెట్టేసి, మరో కథను సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. ఈ కథ బాలయ్యకి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
*  'మహర్షి' సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో మహేశ్ బాబు త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో ఆయన పోలీసాఫీసర్ పాత్ర పోషించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో వాస్తవం లేదని, మహేశ్ పోలీసాఫీసర్ గా నటించడం లేదని తాజా సమాచారం.
Anushka Shetty
NTR
Charan
Balakrishna
Boyapati

More Telugu News