ఇంకొన్నేళ్లకూ నా ఉత్తమ చిత్రం ‘అదే’ అంటే నటనలో నేను ఎదగనట్టే: హీరో విజయ్ దేవరకొండ
- ‘అర్జున్ రెడ్డి’ని మళ్లీ నేను చూస్తే సిగ్గుపడాలి
- ఓ నటుడిగా నేను ఆ స్థాయికి ఎదగాలి
- ప్రతి సినిమాకు నా నటన మెరుగు పడాలి
ఇంకొన్నేళ్లు గడిచినా కూడా అర్జున్ రెడ్డే తన ఉత్తమ చిత్రం అని చెప్పుకుంటే, నటుడిగా తాను ఎదగలేదని అర్థమని అభిప్రాయపడ్డాడు. ప్రతి సినిమాకు తన నటన మెరుగు పడాలన్నదే తన ఉద్దేశమని చెప్పాడు. ‘డియర్ కామ్రేడ్’ గురించి చెబుతూ, తన అభిమానులు చాలా రోజులుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని, వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఉంటుందని చెప్పాడు.