ఓటేయని దిగ్విజయ్ సింగ్.. విరుచుకుపడిన శివరాజ్ సింగ్
- ఆరో విడత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని డిగ్గీరాజా
- ఆయనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్న చౌహాన్
- పదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఓటేయకపోవడం దారుణమన్న మాజీ సీఎం
డిగ్గీరాజా ఓటు వేయకపోవడం వెనక మరో కారణం కూడా ఉందని, ఆయన కమల్‌నాథ్‌ను విశ్వసించడం లేదని అన్నారు. అందుకనే ఆయన పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ ఉండిపోయారని విమర్శించారు. భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి దిగ్విజయ్ బరిలో నిలవగా ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఉన్నారు. దిగ్విజయ్ ఓటు తన సొంత ఊరైన రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రాఘోగఢ్‌లో ఉంది. ఆదివారం జరిగిన ఆరో విడత ఎన్నికల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకోకపోవడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.