ప్రత్యేక విమానంలో చెన్నైకు కేసీఆర్.. రేపు స్టాలిన్‌తో భేటీ
- కేరళ, తమిళనాడులో పర్యటించిన కేసీఆర్
- కేసీఆర్ వెళ్లిన సమయంలో స్టాలిన్ బిజీ
- నేడు శ్రీరంగం ఆలయాన్ని దర్శించుకోనున్న కేసీఆర్
అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండటంతో కేసీఆర్‌తో భేటీ ఆయనకు సాధ్యం కాలేదని డీఎంకే వర్గాలు తెలిపాయి. దీంతో నేటి సాయంత్రం ప్రత్యేక విమానంలో కేసీఆర్ చెన్నైకి బయలు దేరారు. ఈ రోజే శ్రీరంగం ఆలయాన్ని కూడా ఆయన దర్శించుకోనున్నారు. రేపు కేసీఆర్ స్టాలిన్‌తో భేటీ అవుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.