సామాజిక మాధ్యమాల్లో డోకూరు ఎంపీటీసీ స్థానం బ్యాలెట్‌ పత్రాలు

  • రెండో విడత పోలింగ్‌ జరిగిన కేంద్రం ఇది
  • మొబైల్‌లో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌
  • నిందితులను గుర్తిస్తామన్న ఎంపీడీఓ
తెలంగాణలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు ఎంపీటీసీ స్థానం కోసం ముద్రించిన బాలెట్లుగా వీటిని గుర్తించారు. శుక్రవారం ఈ మండలంలో పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. పింక్‌, తెలుపు రంగు బ్యాలెట్లను ఫొటో తీసి సామాజిక మాధ్యమంలో ఉంచడంతో ప్రస్తుతం ఇవి వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ విషయాన్ని ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా ఈ అంశం ఇంకా తన దృష్టికి రాలేదని చెప్పారు. బ్యాలెట్‌ పత్రాల క్రమ సంఖ్య ఆధారంగా నిందితులను గుర్తించి తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Mahbubnagar District
dokuru MPTC
balets in social media

More Telugu News