నేడు మళ్లీ తమిళనాడు వెళ్లనున్న కేసీఆర్.. రేపు స్టాలిన్‌తో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చ
- ఇటీవలే కేరళ, తమిళనాడులో పర్యటించిన కేసీఆర్
- కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉదయం ప్రత్యేక విమానంలో తమిళనాడుకు
- శ్రీరంగం,తిరుచ్చి ఆలయాల సందర్శన
గత సోమవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాలను సందర్శించిన కేసీఆర్ శుక్రవారం తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. దీంతో స్టాలిన్‌తో భేటీ లేనట్టేనని అందరూ భావించారు. అయితే, హైదరాబాద్ చేరుకున్నకేసీఆర్ ముందుగా నిర్ణయించిన ప్రకారం 13న స్టాలిన్‌తో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో నేడు మరోమారు తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్లనున్నారు. శ్రీరంగం, తిరుచ్చి ఆలయాలను సందర్శించిన అనంతరం రాత్రి చెన్నైలో బస చేస్తారు. సోమవారం స్టాలిన్‌తో భేటీ అవుతారు.