Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మన్మథుడు 2'లో సమంత పాత్ర అదేనట

  • గతంలో హిట్ కొట్టిన 'మన్మథుడు'
  • షూటింగు దశలో 'మన్మథుడు 2'
  • వైవిధ్యభరితమైన పాత్రలో నాగ్       
నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సమంత ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆమె పాత్ర ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలోను తలెత్తుతోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోకి తీసుకెళ్లే పాత్రలో ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం.

'మన్మథుడు' సినిమాలో కథానాయకుడు .. అమ్మాయిలకి ఎందుకు దూరంగా వుంటాడనేది తనికెళ్ల భరణి చెబుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళతాడు. అలాంటి పాత్రను ఈ సినిమాలో సమంత చేస్తోందని అంటున్నారు. 'మన్మథుడు 2'లో కథానాయకుడు అమ్మాయిలతో మాత్రమే చనువుగా ఉంటాడట. అందుకు కారణమేమిటనేది సమంత చెబుతుందని అంటున్నారు. 'మన్మథుడు' భారీ విజయాన్ని సాధించిన కారణంగా, సహజంగానే 'మన్మథుడు 2' పై అంచనాలు వున్నాయి. 
nagarjuna

More Telugu News