Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ పడీపడీ నవ్వేలా చేసిన పిల్లాడు.. ముద్దిచ్చి ఆశీర్వదించిన వైసీపీ అధినేత!

  • పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఘటన
  • ఎన్నికల ప్రచారం సందర్భంగా కలిసిన బాలుడు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ, వైసీపీ నేతలంతా ఏపీలో విస్తృతంగా పర్యటించారు. ప్రత్యర్థుల తప్పులను ఎత్తిచూపుతూ తమకే ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగన్ పర్యటన సందర్భంగా ఓ బాలుడు ఆయన దగ్గరకు వచ్చాడు.

అనంతరం బహిరంగ సభల్లో జగన్ ఎలా మాట్లాడతారో అచ్చం అలాగే తన యాసను జోడించి ప్రసంగించాడు. దీంతో జగన్ తో పాటు అక్కడున్న వైసీపీ నేతలు, భద్రతా సిబ్బంది గట్టిగా నవ్వేశారు. ఈ సందర్భంగా ఆ బాలుడి నదుటిపై జగన్ ముద్దిచ్చి ఆశీర్వదించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని మీరూ చూసేయండి.
Andhra Pradesh
Jagan
BOY
IMITATION
West Godavari District
TANUKU

More Telugu News