Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కల్కి' ట్రైలర్ రిలీజ్ తరువాత టెన్షన్ తగ్గిపోయింది: హీరో రాజశేఖర్

  • ప్రశాంత్ వర్మ చాలా బాగా తీశాడు 
  • ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది 
  • మా నమ్మకం మరింత పెరిగింది
తెలుగు తెరపై పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకి రాజశేఖర్ పెట్టింది పేరు. ఈ తరహా పాత్రలు ఆయనకి విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అందువల్లనే ఆయన మరోసారి పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా నిర్మితమైన 'కల్కి' ఈ నెల 31వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ .. "ఈ కథ తీసుకుని ప్రశాంత్ వర్మ నా దగ్గరికి వచ్చి కొత్తగా ట్రై చేద్దామని చెప్పినప్పుడు, ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అనిపించింది. కానీ ఈ సినిమా టీజర్ .. ట్రైలర్ తెచ్చిన రెస్పాన్స్ చూసిన తరువాత నా టెన్షన్ తగ్గిపోయింది. ముఖ్యంగా 'ఏం సెప్తిరి .. ఏం సెప్తిరి' అంటూ నా మేనరిజాన్ని నేనే అనుకరించడం జనంలోకి బాగా వెళ్లింది. ట్రైలర్ కి మేము ఆశించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. చాలా బాగుందంటూ అంతా మెసేజ్ లు పెడుతున్నారు. సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం మరింత పెరిగింది" అని చెప్పుకొచ్చారు.
rajasekhar
adah sharma

More Telugu News