సూర్యాపేటలో అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరి దుర్మరణం!
- సూర్యాపేట జిల్లాలోని ముకుందాపురంలో ఘటన
- ప్రమాదంలో మరో ఇద్దరి కి తీవ్రగాయాలు
- హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతుండగా ప్రమాదం
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన లోకేశ్, కిరణ్ కుమార్ లు చనిపోయారని తెలిపారు. వీరంతా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామనీ, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.