జడ్పీటీసీగా ఆమె ఎన్నికను రద్దు చేయండి.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటాం: బీజేపీ అభ్యర్థి డిమాండ్
- జడ్పీటీసీగా కోవా లక్ష్మి ఎన్నిక ఏకగ్రీవం
- తమను కిడ్నాప్ చేశారన్న శేకు
- తన భర్తను చంపేస్తామని బెదిరించారన్న చంద్రకళ
అయితే లక్ష్మి కుట్రకు పాల్పడ్డారని, తనతో పాటు తన భార్య చంద్రకళను కిడ్నాప్ చేసి వేర్వేరు చోట్ల బంధించారని మైసన్ శేకు ఆరోపించారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోకుంటే తన భర్తను చంపుతామని బెదిరించారని చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని శేకు, చంద్రకళ హెచ్చరించారు.