ప్రభుదేవాతో కలిసి 'మహర్షి' చూడనున్న సల్మాన్

  • మహేశ్ బాబు 25వ మూవీగా 'మహర్షి'
  • హిందీ రీమేక్ పై సల్మాన్ ఆసక్తి
  •  తమిళ రీమేక్ పై విజయ్ దృష్టి 
మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' .. ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది మహేశ్ బాబుకి 25వ సినిమా కావడం వలన, మొదటి నుంచి ఈ సినిమాపై వున్న అంచనాల కారణంగా థియేటర్ల దగ్గర ఒక రేంజ్ లో సందడి కనిపిస్తోంది. ఇక ఈ రోజున ముంబైలో ప్రభుదేవాతో కలిసి సల్మాన్ ఖాన్ ఈ సినిమా చూడనున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా నచ్చితే హిందీ రీమేక్ రైట్స్ తీసుకునే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసుకుని ఆయన రంగంలోకి దిగుతాడని చెబుతున్నారు. గతంలో మహేశ్ బాబు చేసిన 'పోకిరి' సినిమాను హిందీలో రీమేక్ చేసి సల్మాన్ హిట్ కొట్టేసిన సంగతి తెలిసిందే. అందువలన 'మహర్షి' కంటెంట్ పై ఆయన ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. ఇక తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయడానికి విజయ్ ఉత్సాహాన్ని చూపుతుండటం విశేషం.
Go Back to Shorts
salman
prabhudeva

More Telugu News