మమ్మల్ని విమర్శించే ముందు.. ఇలాంటి వాటికి రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు: హరీశ్ శంకర్
- కెమెరా వెనుక ఉంటే బాగుంటుందని తెలుసు
- విరాళాలు సేకరించేందుకు వేశామని తెలుసుకోండి
- మా సినిమాల రివ్యూలు స్వేచ్ఛగా రాసుకోండి
‘డియర్ వెబ్సైట్.. దర్శకులుగా మేం కెమెరా వెనుక ఉంటే బాగుంటుందని మాకు తెలుసు. కానీ మమ్మల్ని విమర్శించే ముందు.. ఈ స్కిట్ మేం అవసరాల్లో ఉన్న దర్శకులకు విరాళాలు సేకరించేందుకు వేశామన్న సంగతి తెలుసుకోండి. మా సినిమాల రివ్యూలను స్వేచ్ఛగా రాయండి.. అంతేకానీ ఓ మంచి ఉద్దేశంతో ఐకమత్యంతో మేం చేసే కార్యక్రమాలకు రివ్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని హరీష్ ట్వీట్ చేశారు.