టాలీవుడ్ నటి సురేఖా వాణి భర్త మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాలీవుడ్ నటి సురేఖా వాణి భర్త మృతి

  • సోమవారం ఉదయం కన్నుమూత
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేశ్ తేజ
  • సురేఖ, సురేశ్ లది ప్రేమవివాహం
టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. సురేఖ వాణి భర్త సురేశ్ తేజ అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేశ్ తేజ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. భర్త మరణంతో సురేఖ వాణి శోకసంద్రంలో మునిగిపోయారు. సురేశ్ తేజ టీవీ కార్యక్రమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'మా'టాకీస్, మొగుడ్స్ పెళ్లామ్స్, హార్ట్ బీట్ వంటి టెలివిజన్ కార్యక్రమాలు రూపొందించింది సురేశ్ తేజనే. అప్పట్లో సురేఖ బుల్లితెర యాంకర్ గా పనిచేశారు. అప్పటికే అదే రంగంలో ఉన్న సురేశ్ తేజతో ఆమె పరిచయం ప్రేమగా మారడం, అది పెళ్లి వరకు వెళ్లడం జరిగాయి. వీరికి ఓ కుమార్తె ఉంది.
Tollywood

More Telugu News