Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసుపత్రిపాలైన 'నిర్భయ' నిందితుడు

'నిర్భయ' అత్యాచారం కేసులో నిందితుడు వినయ్ శర్మ తీవ్రగాయాలతో నేడు లోక్ నాయక్ ఆసుపత్రిలో చేరాడు. వినయ్ శర్మపై సహచర ఖైదీలు దాడి చేసి గాయపరిచారని అతని న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. ఛాతీ భాగంలో నొప్పులు, తీవ్ర జ్వరంతో శర్మ ఆసుపత్రిలో చేరాడని, అతనిపై విషప్రయోగం కూడా జరిగి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నోటి నుంచి రక్తం రావడంతో, స్లో పాయిజనింగ్ అవకాశాలను తోసిపుచ్చలేమని సింగ్ చెప్పారు. ఓ నెల రోజుల నుంచి అతని ఆహారంలో విషం కలుపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం వినయ్ పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

More Telugu News